అమరావతికి ప్రజామోదం లేదు | - | Sakshi
Sakshi News home page

అమరావతికి ప్రజామోదం లేదు

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌

నెల్లూరురూరల్‌: ‘రాజధాని అమరావతికి ప్రజామోదం లేదు. రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా లేరు’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. బుధవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధాని వల్ల చంద్రబాబు, ఆయన అనుచరగణం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. రాజధానిపై పార్లమెంట్‌ చట్టం చేసినంత మాత్రాన మురిసిపోకూడదన్నారు. రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. రాపూరు నుంచి, ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు వరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములున్నట్లు చెప్పారు. జాతీయ రహదారులు, విమానాశ్రయం ఉందన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుపతి రాజధాని అవుతుందని తాళపత్ర గ్రంధాల్లో రాశారని, అది ఏనాటికై నా నిజం అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. క్వార్ట్‌ ్జ, సిలికా మైన్స్‌ కేటాయింపుపై సమాధానం చెప్పాలన్నారు. సమీఉల్లా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement