శారీరక వైకల్యం అడ్డుపడినా ఆమె వెనుకడుగు వేయలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. కానీ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటోంది. వివరాలు.. కావలి పట్టణంలోని కొత్త మసీదువీధికి చెందిన రేష్మ దివ్యాంగురాలు. దివ్యాంగుల కోటాలో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల ద్వారా తనకు ఉద్యోగావకాశం కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి కోరారు. అలాగే తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నెలకు రూ.15,000 పింఛన్ మంజూరు చేసి ఆసరాగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యావంతురాలైన రేష్మ పరిస్థితిని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


