కలిగిరి: గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. జెడ్పీ నిధులతో కలిగిరి పంచాయతీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జెడ్పీటీసీ పాలూరు మాల్యాద్రిరెడ్డి, ఉప సర్పంచ్ పాలూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. కలిగిరిలోని మసీదు వద్ద నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మండలానికి రూ.కోటికిపైగా నిధులను కేటాయించామని, మరికొంత మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అనంతరం మాల్యాద్రిరెడ్డి నివాసంలో అరుణమ్మను పలువురు సర్పంచ్‌లు, నేతలు సత్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కాటం రవీంద్రరెడ్డి, సర్పంచ్ రాగి దివ్య, నేతలు హజరత్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రియాజ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రఘురామిరెడ్డి, తిరుపాల్, మస్తాన్‌రెడ్డి, మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


