ముఖ్య నేత అండతో.. | - | Sakshi
Sakshi News home page

ముఖ్య నేత అండతో..

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 7:24 AM

అక్కడ అంకణం భూమి ధర అక్షరాలా లక్ష రూపాయలకు పైమాటే. అందులోనూ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బిట్‌ కావడంతో మరింత రేటు పలికే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ల్యాండ్‌పై నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత కన్నుపడింది. ఇంకేముంది సర్వేపల్లి నియోజకవర్గ ముఖ్య నేత అండతో దీన్ని కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. దాదాపు రూ.రెండు కోట్ల విలువజేసే దీన్ని ఆక్రమించడమే కాకుండా నిర్మాణ పనులను జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా, చోద్యం చూడటం జిల్లా ఉన్నతాధికారుల వంతవుతోంది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: టీడీపీలో భూ బకాసురుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా, దాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గవర్నమెంట్‌ ల్యాండ్స్‌ అన్యాక్రాంతమవుతున్నా, వాటిని కాపాడే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీంతో కబ్జాదారులు మరింత చెలరేగిపోతూ, ఎక్కడ జాగా కనిపించినా అక్కడే పాగా వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఈ ఉదంతానికి సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం వేదికై ంది.

ధరలు ౖపైపెకి..

వెంకటాచలం మండలంలోని చెముడుగుంట, కాకుటూరు గ్రామాలు నెల్లూరు నగరానికి ఆనుకొని ఉన్నాయి. దీంతో జాతీయ రహదారి పక్కన వివిధ పరిశ్రమలు, కార్ల షోరూమ్‌లను నెలకొల్పుతుండటంతో ఇక్కడ భూముల ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. కాకుటూరు గ్రామంలో లోపలి భాగంలోనే అంకణం ధర ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోందంటే డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకొని పడమర వైపున సర్వే నంబర్‌ 84లో 14 సెంట్లు.. సర్వే నంబర్‌ 85లో 22 సెంట్లు.. ఇలా 36 సెంట్ల (180 అంకణాలు) ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇది అక్షరాలా రూ.రెండు కోట్లకుపైగా పలుకుతోంది.

గతంలో ప్రజావసరాలకు..

ఈ భూమిని గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రం, లైబ్రరీ, పాల కేంద్రాల నిర్మాణాల కోసం కేటాయించినట్లు రీ సర్వే రికార్డుల్లో నమోదై ఉంది. అంగన్‌వాడీ భవనానికి ఐదు.. పాల కేంద్రం కోసం నాలుగు.. లైబ్రరీ కోసం ఐదు సెంట్లను కేటాయించారనే అంశం రికార్డుల్లో ఉంది. ఇదే విషయాన్ని చెప్తున్నా, అక్రమార్కులు ఏ మాత్రం లెక్క చేయకుండా పనులను సాగిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకొని.. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను

సర్వేపల్లి ముఖ్య నేత అండతో ఆక్రమణ

శరవేగంగా నిర్మాణ పనులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

కాకుటూరులో ఇదీ తంతు

ఈ విలువైన భూమిపై నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత కన్ను పడింది. ఎలాగైనా దీన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కుట్రలు పన్నారు. సర్వేపల్లి ముఖ్య నేత అండతో దీన్ని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. వెంటనే ఇక్కడ ప్రహరీ, రూమ్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, ప్రయోజనం శూన్యమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement