నెల్లూరు(టౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలంటూ బీటీఏ నేతలు బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేడి రమేష్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఇంతవరకు బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో నేతలు మాస ప్రసాద్, మనోజ్‌కుమార్, శ్రీనివాసులు, రవి, శంకరయ్య, శ్రీనివాస్, విజయమ్మ, మల్లికార్జునరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు.


