● డీసీసీబీ చైర్మన్‌కు వినతి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ డీసీసీబీ చైర్మన్ ఎం.ధనంజయరెడ్డికి బుధవారం జాయింట్ ఫోరమ్ ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్థానిక కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గతేడాది నవంబర్ నెలలో ఉద్యోగుల వేతనాల సవరణ కోసం ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చలు జరిపారన్నారు. అయితే చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈనెల 23వ తేదీ నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.


