నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్‌వాజ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయంలో వారు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల్ని ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిరాజ్, లీలామోహన్, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


