వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేయడం దారుణం | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ప్లాంట్‌ను కూల్చివేయడం దారుణం

Mar 26 2026 7:24 AM | Updated on Mar 26 2026 7:24 AM

మంత్రి నారాయణ ఆగడాలకు అంతే లేదు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరురూరల్‌: నెల్లూరు 46వ డివిజన్‌లో ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్‌ వద్దనున్న వాటర్‌ ప్లాంట్‌ను మున్సిపల్‌ అధికారులు నోటీలివ్వకుండా కూల్చివేయడం దారుణమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్లాంట్‌ను ఆయన నేతలతో కలిసి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ అందిస్తున్న ప్లాంట్‌పై కక్ష ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నారాయణ విద్యావంతుడై ఉండి పేద ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గాలకు ఎందుకు పాల్పడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వాళ్ల కార్యకర్తలకు దోచిపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నగరంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇలాగైతే పేదల బతుకు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తన అనుయాయులకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ రోడ్లు తవ్వేందుకు కాంట్రాక్ట్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉపయోగపడే పనులు ఒక్కటైన నారాయణ చేశారా అని నిలదీశారు. పెద్దల పక్షాన నిలబడి పేదలకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో త్వరలో బయటపెడతానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎండీ ఖలీల్‌ అహ్మద్‌, 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేలూరు ఉమామహేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు ధనుజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement