తమిళనాడు బోట్ల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు బోట్ల నియంత్రణకు చర్యలు

Mar 25 2026 7:00 AM | Updated on Mar 25 2026 7:00 AM

మంత్రి కొల్లు రవీంద్ర

నెల్లూరు(దర్గామిట్ట): తమిళనాడు బోట్ల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎకై ్సజ్‌, గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సముద్రంలో చేపల వేటకు అక్రమ బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా నివారించడం, జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్యపై నియమించిన కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు రవీంద్ర, ఎన్‌ఎండీ ఫరూఖ్‌, ఆనం రామనారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ తీరంలో మెకనైజ్డ్‌ బోటుతో గస్తీని ముమ్మరం చేసినట్లు చెప్పారు. వేట నిషేధ సమయం పూర్తయ్యేలోగా మరో రెండు బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ అజిత, ఫిషరీస్‌ కమిషనర్‌ రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement