టీబీపై ప్రజలు ముందుగా అవగాహన పెంచుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. మనిషి శారీరకంగా బలంగా ఉంటే టీబీ సోకదు. ఒకవేళ వచ్చినా భయపడాల్సిన పని లేదు. క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గిపోతుంది.
– డాక్టర్ అరుణ, పల్మనాలజిస్ట్, హెచ్‌ఓడీ ప్రభుత్వ సర్వజనాస్పత్రి, నెల్లూరు
ఉచితంగా టీబీ పరీక్షలు
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టీబీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. రెండు వారాలకు మించి దగ్గు వస్తున్నా.. గళ్ల పడుతున్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ క్షయ ఉంటే అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి మంచి మందులు అందించడంతోపాటు పౌష్టికాహారానికి నగదు అందజేస్తున్నాం.
– డాక్టర్ ఖాదర్‌వలీ, జిల్లా టీబీ, ఎయిడ్స్ నివారణాధికారి
●


