దిగజారిన ధాన్యం ధరలు | - | Sakshi
Sakshi News home page

దిగజారిన ధాన్యం ధరలు

Mar 25 2026 6:59 AM | Updated on Mar 25 2026 6:59 AM

మర్యాదపూర్వకంగా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

రూ.22 వేల నుంచి రూ.17 వేలకు పతనం

సిండికేటైన రైస్‌మిల్లర్లు, దళారులు,

వ్యాపారులు

సీఎమ్మార్‌కు గోతాలివ్వకుండా జాప్యం

ఫలితంగా తక్కువ ధరలకే

విక్రయిస్తున్న రైతులు

పుట్టికి 850 కిలోలకు బదులు 950

తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

నెల్లూరు(పొగతోట): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించక తక్కవ్లకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో పుట్టి (850 కిలోల) ధా న్యం ధర రూ.22 వేల నుంచి రూ.23 వేల మేర ప ది రోజుల క్రితం వరకు ఉండింది. అయితే మిల్లర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రేట్లను తగ్గించేశారు.

శాసిస్తున్న దళారులు

పుట్టి ధాన్యాన్ని రూ.16 వేల నుంచి రూ.17 వేలకు ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశముందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతల తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో దళారులు చెప్పిన మొత్తానికే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. చేసేది లేక రైతులు దీనికి అంగీకరించాల్సి వస్తోంది. రేట్లు లేకపోవడం, దిగుబడి తక్కువగా ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని అయోమయ పరిస్థితుల్లో వారున్నారు.

మద్దతు ధరేదీ..?

జిల్లాలో ఈ సీజన్లో సుమారు 7.7 లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. గ్రేడ్‌ – ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.2389 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అదే సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2369 మేర నిర్ణయించింది. అయితే ఈ రేట్లు రైతులకు లభించడంలేదు. ఇతర జిల్లాల నుంచి రైస్‌మిల్లర్లు, వ్యాపారులు రాకపోవడంతో ధాన్యం ధరలు పతనమవుతున్నాయి.

గతం.. ఎంతో ఘనం

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో 2022 – 24 మధ్య ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి రైస్‌ మిల్లర్లు, వ్యాపారులను అప్పటి జిల్లా యంత్రాంగం ఆహ్వానించింది. వ్యాపారుల మధ్య పోటీత త్వం పెరిగి పుట్టి ధాన్యాన్ని రూ.27 వేల నుంచి రూ. 28 వేలకు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం దీన్ని విస్మరించడంలో అన్నదాతలు కుదేలవుతున్నారు. మరోవైపు జిల్లాలోని కొంత మంది దళారులు, వ్యాపారులు.. నాణ్యత లేని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు తీసుకెళ్లి వారికి చూపించారనీ.. ప్రస్తుత సీజన్లో ఇలానే ఉందని నమ్మించడంలో కొనుగోళ్లకు వారు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

ఇందుకూరుపేట మండలానికి చెందిన రైతు మస్తాన్‌వలీ నాలుగెకరాల్లో వరిని సాగు చేశారు. కోతల అనంతరం 13 పుట్ల ధాన్యం దిగుబడొచ్చింది. అదే వాతావరణం అనుకూలించి ఉంటే 15 నుంచి 16 పుట్ల వరకు వస్తుంది. పుట్టి ధాన్యాన్ని రూ.17 వేల చొప్పున విక్రయించారు. తేమ శాతం అధికంగా ఉందనే కారణాన్ని చూపుతూ 850 కిలోలకు బదులు 950 కిలోలను తీసుకున్నారు.

సంగం మండలానికి చెందిన రామసుబ్బారెడ్డి.. ఐదెకరాల్లో బీపీటీని సాగు చేశారు. సుమారు 17 పుట్ల ధాన్యం దిగుబడొచ్చింది. సీఎమ్మార్‌కు ఇచ్చేందుకు యత్నించగా, గోతాల్లేవంటూ జాప్యం చేశారు. గత్యంతరం లేక దళారిని సంప్రదించారు. భూములకు సంబంధించిన పత్రాల జిరాక్స్‌లను తీసుకొని బేరం కుదర్చుకున్నారు. రెండు గంటల్లోపు గోతాలు, లారీ వచ్చి ధాన్యాన్ని లోడ్‌ చేసుకెళ్లింది. పుట్టికి రూ.16,500ను చెల్లించేలా మాట్లాడుకున్నారు. రైతు బ్యాంక్‌ ఖాతాలో నగదు జమయ్యాక అదనంగా వచ్చిన నగదు దళారీకి ఇవ్వాల్సి ఉంది. పుట్టికి అదనంగా 90 కిలోల ధాన్యాన్ని తీసుకోవడంతో ఈయన నష్టపోయారు. ఇదే తరహాలో జిల్లాలో వేలాది మంది రైతులు ఏటా ఆర్థికంగా చితికిపోతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తప్పవు రైతులు వారికి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించి విక్రయించాలి. అక్కడ మద్దతు ధర లభిస్తోంది. అన్నదాతలు నష్టపోకుండా చూస్తున్నాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement