నెల్లూరురూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలు విషయాలపై చర్చించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ ఏఓ సస్పెన్షన్
నెల్లూరు(పొగతోట): డీపీఆర్సీ నిధులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో జెడ్పీ పరిపాలనాధికారి ఆర్సీఎస్ వర్మను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం జారీ చేశారు. శిక్షణకు సంబంధించిన నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడి సమాచారాన్ని అఽధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, నకిలీ బిల్లులు పెట్టి పక్కదారి పట్టించారు. సీఈఓ చాంబర్‌లో ఫైల్ ఉండగా, అధికారి లేని సమయంలో తెప్పించుకొని బిల్లులను ప్రాసెస్ చేయించారు. శిక్షణ కార్యక్రమాల విషయంలో మండలాధికారులను ఫోన్ల ద్వారా బెదిరించి అధిక మొత్తాలకు బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎఫ్ విభాగ ఏఓను సస్పెన్షన్ వేటు విధించారు.
డీటీఎం సరెండర్
శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహేషువాను ఏపీఎస్సైఆర్డీకి సరెండర్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి జారీ చేశారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,483 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,777 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
హంస వాహనంపై
రాములోరి వైభవం
సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామంలో ఉన్న సీతారామస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు సోమవారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. హంస వాహనంపై స్వామివారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమానికి గౌడ సంఘం ఉభయకర్తలుగా వ్యవహరించింది.


