నెల్లూరు(పొగతోట): బ్యాంక్ గ్యారెంటీలివ్వకుండా.. గోతాలను సకాలంలో సరఫరా చేయకుండా.. సీఎమ్మార్ విషయంలో రైస్‌మిల్లర్లు జాప్యం చేస్తున్న తరుణంలో, పలు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలను జేసీ వెంకటేశ్వర్లు మంగళవారం చేపట్టారు. తమకు మంత్రులు.. ఎమ్మెల్యేలు తెలుసునని.. మంత్రి ఇంట్లో మూడు నెలలు ఉన్నామని.. మాకు రావాల్సిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని మంత్రి ఇప్పించారని.. ఒక్క అవకాశమిస్తే బ్యాంక్ గ్యారెంటీలిస్తామంటూ జేసీని మిల్లర్లు ప్రాధేయపడ్డారు. రికార్డులను చూపాలని ఆయన అడగ్గా, మిల్లర్లు నీళ్లు నమి లారు. ట్రక్ షీట్లు లేకుండా ధాన్యం అన్‌లోడ్ చేయడం తదితరాలను పరిశీలించారు. అధికార పార్టీ నేతలతో మిల్లర్లు ఫోన్లు చేయించారు. 24 గంటల్లో బ్యాంక్ గ్యారెంటీలిచ్చేందుకు.. గోతా లను సరఫరా చేసేందుకు మిల్లర్లు అంగీకరించారు. అనంతరం జేసీ మాట్లాడారు. ధాన్యానికి మద్దతు ధరలివ్వకుండా నష్టపర్చే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ధాన్యం ధర లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్‌ఓ లీలారాణి, డీఎం అర్జున్‌రావు, ఏఎస్‌ఓలు లక్ష్మీనారాయణరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


