యూరియా కోసం తీరని వెతలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం తీరని వెతలు

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

యూరియా కోసం తీరని వెతలు

యూరియా కోసం తీరని వెతలు

బారులుదీరిన రైతులు

స్థానిక సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం రైతన్నలు గంటల తరబడి క్యూలో బుధవారం బారులుదీరారు. సొసైటీ కార్యాలయంలో ఉన్న 500 యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుంచే టోకెన్ల కోసం క్యూల్లో నిలబడ్డారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసుల సహకారంతో సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్‌ పంపిణీ చేయించారు. యూరియాను అధికార యంత్రాంగం సరిపడా సరఫరా చేయలేకపోతుండటంతో అధిక ధరలు చెల్లించి ప్రైవేట్‌ దుకాణాల్లో కొనలేక ఇలా పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. – సీతారామపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement