ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు

నెల్లూరురూరల్‌: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. అసమర్థను నిలదీసినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ బాలిక గంజాయి బా్‌య్‌చ్‌ అఘాయిత్యానికి బలైపోయిన నేపథ్యంలో పరామర్శించినందుకు నమోదు చేసిన కేసులో శనివారం పోలీసుల విచారణకు కోవూరుకు కాకాణి బయల్దేరారు. ఈ క్రమంలో హడావుడిగా వచ్చిన కానిస్టేబుల్‌ కాకాణి నివాసానికి చేరుకుని ఈ రోజుకు విచారణకు రావొద్దని, 19వ తేదీన తామే మీ నివాసంలోనే విచారిస్తామంటూ మరో నోటీసు అందజేశారు. దీంతో కాకాణి తనపై అక్రమ కేసు నమోదు చేసి ఈ రోజు విచారణకు రావాలని 10వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హడావుడిగా వచ్చి ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తాను ఏం నేరం చేస్తే ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నాతోపాటు మైనర్‌ బాలిక కుటుంబాన్ని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఇతర మైనార్టీ నాయకులు పరామర్శించి అదే రకమైన వ్యాఖ్యలే చేశారని, మరి తానొక్కడికే ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి, ప్రశ్నించే తత్వాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, కూటమి నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.

ప్రభుత్వానికి రక్షక భటులుగా మారారు

రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ కూటమి నాయకుల కనుసన్నాల్లో పని చేస్తున్నారని, ప్రజలకు కాకుండా ప్రభుత్వానికి రక్షక భటుల్లా వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. నేరం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పు లేదని, కూటమి నాయకుల ఆనందం కోసం తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు రేపు అనుభవించాల్సి ఉంటుందన్నారు.

గంజాయి అరికట్టలేకపోవడం

పోలీసుల వైఫల్యం కాదా?

మైనర్‌ బాలిక మృతి సమాజాన్ని కలిచి వేసిందని, ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచి పరామర్శించేందుకు వెళ్తే కేసులు కట్టడం కాదాని, చేతనైతే గంజాయిని అరికట్టి.. ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలన్నారు. బాలికతో బలవంతంగా విష ద్రవం తాగించారని కేసు నమోదు చేశారని, కోవూరు, నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆ బిడ్డకు సరైన వైద్యం అందలేదని బాలిక తండ్రే స్పష్టంగా చెప్పి కన్నీరుమున్నీరయ్యాడన్నారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే గంజాయి లేకుండా నిర్మూలిస్తానని స్టేట్మెంట్లు ఇచ్చాడని, 19 నెలలు అవుతున్నా గంజాయిని నిర్మూలించలేకపోతున్నారని, మారుమూల గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు.

ఏం నేరం చేశానని పోలీసులు

అత్యుత్సాహం చూపిస్తున్నారు

నా తర్వాత వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజీజ్‌, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరామర్శించారే

వారిపై ఎందుకు కేసులు కట్టలేదు

ప్రభుత్వం, పోలీసుల అసమర్థత కారణంగానే కాదా ఆ బాలిక చనిపోయింది?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం

ప్రశ్నించారని ఆడపిల్లకు

నోటీసులిస్తారా?

కాకాణి పూజితమ్మ పైనా అక్రమ కేసు నమోదు చేసి వాట్సప్‌ ద్వారా నోటీసులు పంపించారన్నారు. పూజితమ్మ చేసిన తప్పు ఏమిటో తెలియడం లేదు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను చూసి, విశ్లేషించి గంజాయి వల్లనే మైనర్‌ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసిందని, మీడియా సమావేశంలో మాట్లాడింది తప్పన్నట్లు పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. పూజితమ్మ ప్రశ్నించినట్లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్యపు మాటలు మాట్లాడాడు. పోలీసులు అయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవగలరా? అని ప్రశ్నించారు. సీబీఐ, సిట్‌ నివేదికలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అక్రమ కేసులకు బయపడే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా పోరాడి జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని, ఆ తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement