అన్నదాత సుఖీభవకు అరకొర | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవకు అరకొర

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

అన్నద

అన్నదాత సుఖీభవకు అరకొర

అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగనామం పెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2.45 మంది రైతులకు రైతు భరోసా అందిస్తే.. కూటమి రెండో ఏడాది అమలు చేసినా.. కేవలం 1.80 లక్షల మందికి కూడా ఇవ్వకుండా లబ్ధిదారుల కోత పెట్టింది. ఈ సంవత్సరమైనా బడ్జెట్‌లో నిధులు పెంచుతారని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది.

పరిశ్రమలకు నిధులేవి

జిల్లాలో కొత్తగా పరిశ్రమలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కొత్తగా పరిశ్రమలు గురించి ప్రస్తావించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన నారంపేట పరిశ్రమల హబ్‌కు నిధులు ఇవ్వలేదు. నెల్లూరు రూరల్‌ మండలం ఆమంచర్ల వద్ద కూడా పరిశ్రమల హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల కాలంలో పాలకులు ప్రకటించినప్పటికీ దానికి కూడా నిధులు కేటాయించలేదు. బకింగ్‌హామ్‌ కెనాల్‌ విస్తరణ ఊసే లేదు. నెల్లూరకు, చైన్నె, బెంగళూరు కారిడార్‌కు సంబంధించి గతంలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదు.

జిల్లాలో సుమారు 3.7 లక్షల మంది పింఛన్‌ దారులున్నారు. వీరిలో కొంతమంది మృత్యువాత పడ్డారు. కొత్తగా వితంతువులు, హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారు, బెడ్‌ రిడన్‌ పేషెంట్లు 5 వేల మంది వరకు ఉన్నారు. కొత్త వారు దరఖాస్తు చేసుకుని పింఛన్లు కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.

కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పు కొట్టుకుంది. జిల్లాలో సుమారు 4 లక్షల మంది అర్హత కలిగిన నిరుద్యోగులున్నారు. అయినా బడ్జెట్‌లో వారి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి సంగతి మర్చిపోయారు. ఇలా అన్ని వర్గాలను నిరాశ పరిచిందని జిల్లా వాసులు ప్రభుత్వంపై మండి పడుతున్నారు.

అన్నదాత సుఖీభవకు అరకొర 
1
1/3

అన్నదాత సుఖీభవకు అరకొర

అన్నదాత సుఖీభవకు అరకొర 
2
2/3

అన్నదాత సుఖీభవకు అరకొర

అన్నదాత సుఖీభవకు అరకొర 
3
3/3

అన్నదాత సుఖీభవకు అరకొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement