శ్రీవారి దర్శనానికి 12 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

శ్రీవ

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,222 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 24,882 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పెద్ద పులి

సంచారం ఉంది జాగ్రత్త

ఉదయగిరి: శివరాత్రిని పురస్కరించుకుని ఉదయగిరి అటవీశాఖ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని, సిద్ధేశ్వరంలోని పురాతన దేవాలయానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్రావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి ఎవరూ ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతంలో క్షేత్రం ఉన్నందున స్నానం కోసం కోనేరులో తప్ప ఇతర వాగులు, వంకలు, బావుల్లో స్నానం చేయొద్దన్నారు. భక్తుల సౌకర్యార్థం వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అటవీ ప్రాంతం కావడంతో మహిళలు విలువైన బంగారు అభరణాలు ధరించొద్దని పేర్కొన్నారు.

పెరుమాళ్లపాడుకు

భక్తులెవరూ రావొద్దు

చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడులో ఇసుక గర్భం నుంచి బయటపడిన నాగమల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు ఎవరూ రావొద్దని పోలీసులు, రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆత్మకూరు సీఐ గంగాధర్‌, చేజర్ల తహసీల్దారు మస్తానయ్య, చేజర్ల ఎస్సై తిరుమలేశ్వరరావు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు, దర్శనాలు నిర్వహించడం లేదన్నారు. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ల్లో వస్తున్న సమాచారం నమ్మి భక్తులు ఎవరు రావద్దనారు. ఆలయం శిథిలం కావడంతో పాటు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్నారు.

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ వరప్రసాదరావు తెలిపారు. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లల్లో 17 మంది అధ్యాపకులను కస్టోడియన్లుగా నియమించినట్లు చెప్పారు. స్టోరేజీ పాయింట్లల్లో ప్రశ్నపత్రాలను నిల్వ ఉంచేందుకు ట్రంకుపెట్టెలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 81 సెంటర్లల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

శ్రీవారి దర్శనానికి  12 గంటలు 1
1/2

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

శ్రీవారి దర్శనానికి  12 గంటలు 2
2/2

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement