కూలి పనులకు వెళ్లి..
● ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి
మర్రిపాడు: మర్రిపాడు మండలం ఏపిలగుంట–శెట్టిసముద్రం మలుపు వద్ద పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెగళ్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన వారు కూలి పనుల నిమిత్తం పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఏపిలగుంట వైపు నుంచి చిలకపాడుకు వస్తున్నారు. శెట్టి సముద్రం క్రాస్‌రోడ్డు వచ్చే సరికి కారుకు సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నాగమల్లేశ్వరి, సరస్వతి, రామలక్ష్మమ్మలకు గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమల్లేశ్వరి(26) మృతి చెందారు. ఏఎస్సై నజీర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలి పనులకు వెళ్లి..


