అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Feb 14 2026 9:58 AM | Updated on Feb 14 2026 9:58 AM

అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు

అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రాపూరు: మండలంలోని పంగిలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం ఉదయం ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఓ వ్యక్తికి తీవ్రయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మల్లి కోటేశ్వరరావు తన ఇంట్లో నిద్రిస్తుండగా టీవీ, ఫ్రిడ్జ్‌, లైట్‌ ద్వారా ఒక్కసారిగా శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన గ్రామస్తులు మంటలు ఆర్పివేసి కోటేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి.

కండలేరులో 56.820 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 56.820 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్‌ కాలువకు 200, హైలెవల్‌ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement