బిషప్‌లుగా పట్టాభిషేకం
నెల్లూరు(బృందావనం): నెల్లూ రు మూలాపేట బట్వాడిపాళెం సెంటర్‌లో ఉన్న ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెంటర్ ఫర్ ఎపిస్కోపల్ ఫెలో షిప్ ఇన్ ఇండియా (సెఫీ) – డయోసిస్ ఆధ్వర్యంలో బుధవారం ‘బిషప్‌ల పట్టాభిషేకం’ ఘనంగా జరిగింది. సెఫీ – డయాసిస్ అధ్యక్షుడు బిషప్ పాల్‌సుందర్ శేఖరన్ ఆధ్వర్యంలో రెవరెండ్ ఎస్.ప్రేమ్‌కుమార్ (కొవ్వూరు), వి.ఆశామీనన్ (అల్లూరు), ఎస్.ప్రకాష్ (చైన్నె)ను బిషప్‌లుగా పట్టాభిషేకం నిర్వహించారు. సర్టిఫికెట్లను అందజేసి వారి బాధ్యతలను పాల్‌సుందర్ శేఖరన్ వివరించారు. రెవరెండ్ రాజశేఖర్ దాసరి ప్రార్థనతో కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది దైవజనులకు రెవరెండ్‌గా అభిషేకం చేసి వివాహ లైసెన్స్‌లు మంజూరు చేశారు. సంప్రదాయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ‘సెఫీ – డయోసిస్’ బిషప్‌లు స్టీఫెన్, శ్యాంసన్, ప్రేమ్‌కుమార్, శ్రీనివాసరావు, జయశీలన్, నెల్లూరు ఇన్‌చార్జి జె ర్మియా తదితరులు పాల్గొన్నారు. తొలుత బిషప్‌లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్‌కుమార్, ఆశామీనన్, ప్రకాష్‌ల వ్యక్తిత్వ సాక్ష్యాలు, సంఘీయులుగా వారందించిన సేవలను దైవజ్ఞనులు వివరించారు. కార్యక్రమంలో ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి చైర్మన్ ఉరందూరు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


