నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కూలీల సంఖ్య పెంచండి ● డ్వామా పీడీ గంగా భవాని
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పథకం అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ గంగా భవాని హెచ్చరించారు. బుధవారం డ్వామా కార్యాలయంలో క్లస్టర్ ఏపీడీలు, వివిధ మండలాల ఏపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని జాబ్‌కార్డులు కలిగిన కూలీల చేత పూర్తి చేయించాలన్నారు. సోషల్ ఆడిట్ రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజూ ఆయా పంచాయతీల్లో జరుగుతున్న పనులను పరిశీలించాలన్నారు. ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. కూలీల సంఖ్య పెంచే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స మావేశంలో అడిషనల్ పీడీ స్వరూప్ పాల్గొన్నారు.


