పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక నేడు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషుల జిల్లా జట్టు ఎంపికలు సంగం మండలం దువ్వూరు గ్రామంలోని కలవకూరి కోటారెడ్డి క్రీడా ప్రాంగణంలో గురువారం జరుగుతాయని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హరీష్, కార్యదర్శి గంటా సతీష్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగే 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల పురుషుల కబడ్డీ చాంపియషిప్‌లో నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. 85 కిలోల్లోపు బరువున్న వారు మాత్రమే హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 72785 55777 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కొనసాగుతున్న
నిరసన దీక్షలు
సైదాపురం: మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ సైదాపురంలో బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నేతలు మాట్లాడుతూ ప్రస్తుత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సైదాపురం నుంచి తిరుపతికి వెళ్లాలంటే అధిక ప్రయాణ భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు గంగాధర్, షఫీ, వివిధ సంఘాల ప్రతినిధులు చెంగల్రావు, అనిల్, పవన్ తదితరులున్నారు.


