15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● పోలీసుల ముమ్మర తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వేలిముద్రలను పరిశీలించారు. నేర చరిత్ర లేదని తేలిన అనంతరం వారిని విడుదల చేశారు. రాత్రివేళల్లో అకారణంగా ఎవరైనా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో గస్తీని పెంచారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 106 మంది వాహనదారులపై ఈ చలానాలు వేసి రూ.66,871 ఫైన్ విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 15 కేసులు పెట్టారు. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు పాల్గొన్నారు.
15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు


