సమస్యలు పరిష్కరించాలంటూ..
● డీసీఓ కార్యాలయం వద్ద నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరులోని జిల్లా సహకార శాఖాధికారి (డీసీఓ) కార్యాలయం వద్ద మంగళవారం జేఏసీ నా యకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టిన అనంతరం డీసీఓ గుర్రప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేసే వారి రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచాలన్నారు. రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాన్నారు. 2019 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారిని పర్మినెంట్ చేసి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. బదిలీలు మూడు సంవత్సరాలకు ఒకసారి కాకుండా నిరంతర పక్రియగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రా మానాయుడు, లీగల్ సెల్ నాయకులు సురేష్‌కుమార్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణమూర్తి, ట్రెజరర్ రాధయ్య, నాయకులు మల్లికార్జునగౌడ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలంటూ..


