సోషల్ ఆడిట్ సర్వేను పూర్తి చేయాలి
నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో మౌలిక వసతుల స్థితిగతులను తెలిపే సోషల్ ఆడిట్ సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని డీఈఓ బాలాజీరావు ఆదేశించారు. నెల్లూరు దర్గామిట్టలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జిల్లాలోని సీఆర్‌ఎంటీలకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం – మౌలిక సదుపాయాల కల్పనకు సర్వే జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు ఏ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలన్నా సీఆర్‌ఎంటీల పాత్ర కీలకమన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ డోనర్ యాప్‌లో ఆయా పాఠశాలలకు ఏ వసతులు కావాలి, వాటిని సమకూర్చే విధంగా దాతల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్‌బాబు, సీఎంఓ రమణయ్య, డిప్యూటీ డీఈఓ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


