రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు అధికారులు ఫేస్‌వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారులపై రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లు ముఖం శుభ్రం చేసుకుంనేందుకు నీళ్లు ఇస్తున్నారు. అనంతరం వారితో కొద్దిసేపు మాట్లాడి జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రధానంగా నిద్రమత్తు, మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే వాహనాన్ని నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి విశ్రాంతి తీసుకోవాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకుండా రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను గమనిస్తూ వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని హెచ్చరిస్తున్నారు.


