లభ్యం కావడం లేదు
యూరియా లభ్యం కాక అల్లాడిపోతున్నాం. రైతు సేవా కేంద్రంలో ఎకరాకు బస్తా లెక్కన రెండు వారాల క్రితం అందజేశారు. వచ్చిందీ అధికార పార్టీ నేతలకే సరిపోయింది. రెండో కోటా యూరియా కోసం బస్తాను రూ.350 నుంచి రూ.400 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది.
– మోటుపల్లి వెంకటేశ్వర్లు, రైతు,
రాజోలుపాడు
దుకాణంలో
కొనుగోలు చేస్తున్నాం
రైతు సేవా కేంద్రాల వద్ద ఎకరాకు ఒక బస్తా యూరియా చొప్పున ఇస్తుండటంతో అది ఏ మాత్రం సరిపోవడంలేదు. ఇక్కడ నేతల పెత్తనం అధికంగా ఉంది. దీంతో ఎరువుల దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
– పెంచలరెడ్డి, రైతు, పులికల్లు
కంటితుడుపుగా ఇస్తున్నారు..
మారిన వాతావరణ పరిస్థితుల తరుణంలో తగినంత యూరియాను అందించకపోతే వరి పైరులో దిగుబడులు రావు. కుంటిసాకులతో సరఫరాను తగ్గించి ఎకరాకు మూడు బస్తాలే అనడం సరికాదు. బ్లాక్‌లో రూ.400 చొప్పున కొనుగోలు చేసి తెచ్చుకున్నా. పదెకరాలు సాగు చేస్తున్న నాకు మూడు దఫాలుగా ఇస్తామని చెప్పారు. వాళ్ల చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి.
– ఇటుకల పెంచలయ్య, రైతు,
మహిమలూరు, ఆత్మకూరు
గతంతో పోలిస్తే ఖర్చు పెరిగింది
సాగు చేయాలంటే పరిస్థితులు అనుకూలించడంలేదు. వర్షాలతో దెబ్బతిన్న నారుమడులను కాపాడుకోవడం ఓ ఎత్తయితే.. యూరియా కోసం తిరగడం మరో సమస్యగా మారింది. పుష్కలంగా అందించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదు. బ్లాక్‌లో విక్రయాలు జరగకుండా సక్రమంగా పంపిణీ చేయాలి.
– వెంకటేశ్వర్లురెడ్డి, రైతు,
కొండమీదకొండూరు, ఏఎస్‌పేట
గత ప్రభుత్వ తరహాలో ఆదుకోవాలి
బత్తాయి, వరిని రెండెకరాల చొప్పున నాటా. మరో 15 రోజుల్లో బత్తాయి తోటకు నీళ్లు వేస్తా. గతంలో ఆర్బీకేల్లో యూరియా అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ తరహాలో మమ్మల్ని ఆదుకోవాలి.
– నూతలపాటి మాల్యాద్రి,
వెంగమాంబపురం, వేంపాడు,
వరికుంటపాడు
●
లభ్యం కావడం లేదు
లభ్యం కావడం లేదు
లభ్యం కావడం లేదు
లభ్యం కావడం లేదు


