నేరస్తులపై ఉక్కుపాదం : ఐజీ
నెల్లూరు(క్రైమ్): ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి నెల్లూరు చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలిచ్చారు. సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకున్నారు. శాఖాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని, వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్, ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


