
వాయిగుండ్ల వెంకట్ ప్రమాణస్వీకారం
నెల్లూరు(బృందావనం): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆలయ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ వాయిగుండ్ల వెంకట్‌తో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్‌యాదవ్, కొలుసు పార్థసారథి హాజరయ్యారు. తమ సంస్థ అధినేతకు శ్రీశైలంలో భక్తులు సేవ చేసే అవకాశం లభించడంపై ఆ కంపెనీ సీజీఎంలు అభినవరాజు, సుధాకర్, సత్తార్, విజయకుమార్, కాంచన ప్రసాద్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
నేడు చైన్నె–నెల్లూరు
మెమూ రైళ్ల రద్దు
నాయుడుపేటటౌన్: చైన్నె–నెల్లూరు మధ్య నడిచే మెమూ (నంబరు 66035, 66036) రైళ్లు మంగళవారం పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెమూ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.