
బైక్‌ను ఢీకొట్టిన కారు
● రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
కావలి(అల్లూరు): రోడ్డు ప్రమాదంలో కావలికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పాలవల్లి పద్మనాభరెడ్డి (58) మృతిచెందిన ఘటన ముంగమూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడైన పద్మనాభరెడ్డి వైఎస్సార్‌సీపీలో కీలకంగా ఉన్నారు. అల్లూరు నుంచి పద్మనాభరెడ్డి, రామకోటారెడ్డి మోటార్‌బైక్‌పై బయలుదేరారు. కొంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించగా పద్మనాభరెడ్డి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రామకోటారెడ్డికి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.