
రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి
వెంకటాచలం: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కాకుటూరు వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకుటూరు గ్రామానికి చెందిన కొండలరావు (47) విక్రమ సింహపురి యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నాడు. పని నిమిత్తం తన నివాసం నుంచి జాతీయ రహదారి దాటుతుండగా గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. కొండలరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.