
ఘనంగా చిన్న గంధ మహోత్సవం
వెంకటాచలం: మండలంలోని కసుమూరులో మస్తాన్‌వలీ దర్గా చిన్న గంధ మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. చందన్ మహల్ నుంచి గంధాన్ని ఉదయం తొమ్మిదింటికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. దర్గా ప్రాంగణానికి 11 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా మస్తాన్‌వలీ సమాధి వద్ద తహలీల్ ఫాతేహాను కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ నిర్వహించారు. తదుపరి సమాధికి గంధాన్ని పూశారు. భక్తులకు పంపిణీ చేశారు. దీంతో గంధ మహోత్సవాలు ముగిశాయి.
భక్తిశ్రద్ధలతో
తహలీల్ ఫాతేహా
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గంధ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా తహలీల్ ఫాతేహాను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తస్బీని ప్రదర్శించారు. అనంతరం కానుకలను భక్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలను దర్గా సజ్జదా హఫీజ్ పాషా నిర్వహించారు. తస్బీని చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గంధ మహోత్సవం ముగిసింది. వక్ఫ్‌బోర్డు ఈఓ మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఆలయ తొలగింపునకు
యత్నం
● స్థానికులు.. అధికారుల మధ్య వాగ్వాదం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఆక్రమణల తొలగింపులో భాగంగా పట్టణంలోని ముంబై రహదారిపై కేఎం హాస్పిటల్ వద్ద చెంగాళమ్మ ఆలయాన్ని తొలగించే విషయమై స్థానికులు, నగర పంచాయతీ అధికారుల మధ్య వివాదం చెలరేగింది. ఆలయాన్ని తొలగించేందుకు వీల్లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బాలకృష్ణ, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై సంతోష్‌రెడ్డి చేరుకొని వీరితో చర్చించారు. 20 ఏళ్లుగా ఉన్న ఆలయాన్ని తొలగించడం తగదని చెప్పారు. కాగా మరో ప్రదేశంలో ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఘనంగా చిన్న గంధ మహోత్సవం