
ఏ సమయంలోనైనా 40 వేల క్యూసెక్కుల విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి ఏ సమయంలోనైనా పెన్నాకు 40 వేల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయనున్నామని ఈఈ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఎగువ ప్రాంతంలోని ఆదినిమ్మాయిపల్లి రెగ్యులేటర్ నుంచి సుమారు 60 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో నీటిని విడుదల చేయనున్నామన్నారు.
73.689 టీఎంసీల నీరు
జలాశయంలో శనివారం సాయంత్రానికి 73.689 టీయంసీల నీరు నిల్వ ఉంది. పెన్నాకు 38,950, ఉత్తర కాలువకు 350, కండలేరు కాలువకు 10,450 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయంలో 99.993 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరు సిటీ: పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ అనూష ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయమై డివిజన్లోని తహసీల్దార్లను అప్రమత్తం చేశామని వివరించారు. ఆటోల్లో మైక్‌ల ద్వారా ప్రజలకు సమాచారమిచ్చామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.