
త్వరలో పోస్టుల భర్తీ
ఉదయగిరి: స్థానిక సీహెచ్‌సీలో ఏళ్లుగా భర్తీ కాకుండా ఉన్న పలు వైద్య సిబ్బంది పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని జిల్లా డీసీహెచ్ పరిమళ పేర్కొన్నారు. ఉదయగిరిలోని సీహెచ్‌సీని శనివారం తనిఖీ చేసిన అనంతరం రికార్డులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రోగులకు వైద్యసేవలను సక్రమంగా అందించాలని సూచించారు. విధులకు సకాలంలో హాజరుకావాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలతో రోగులకు సేవలందకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీలో ఉన్న పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. వైద్యులు ప్రశాంత్, శివరామ్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.