
గ్రామాల అభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: ‘అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. తద్వా రా జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా యని చెప్పారు. వాటిని సక్రమంగా అమ లు చేసి అన్ని విభాగాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. పంచాయతీల్లో తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పి ంచాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కిచెన్ గార్డెన్స్, ఇంటింటి చెత్త సేకరణ, గ్రీన్ అంబాసిడర్స్, ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రోత్స హించడం తదితరాల గురించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మరు గుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు నాగరాజకుమారి, గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, పంచాయతీరాజ్, ఆర్‌డ బ్ల్యూఎస్ ఎస్‌ఈలు కోటేశ్వరరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.