
బంగారు దుకాణాల్లో ఐటీ సోదాలు
నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని రెండు బంగారు దుకాణాలపై కేంద్ర ఆదాయపన్ను శాఖ అధికారుల బృందాలు బుధవారం మెరుపుదాడులు నిర్వహించాయి. ఆచారివీధి, కాపువీధి తదితర ప్రాంతాల్లో ఉన్న డీపీ, జేటీ హోల్‌సేల్ బంగారు దుకాణాలు, వాటి యజమానుల నివాసాల్లో వేకువజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో బంగారు వ్యాపారుల్లో కలకలం రేగింది. ప్రధాన నగరాలతోపాటు హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించే గోల్డ్ షాప్‌ల లక్ష్యంగా అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. నిత్యం కిలోల కొద్ది బంగారం క్రయవిక్రయం చేసే హోల్‌సేల్ దుకాణాల నిర్వాహకులు అందుకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా నిర్వహించలేదన్న ఫిర్యాదులు, ఆరోపణలు, బిల్లుల చెల్లింపు, రాబడి, ఖర్చు తదితర వివరాలను రికార్డుల్లో సరిగ్గా పొందు పరచలేదన్న ప్రధాన కారణంగానే ఈ దాడులు జరిగినట్లు తెలిసింది. ఇటీవల బంగారం ధరకు నియంత్రణ లేకపోవడంతోపాటు కొద్దికాలంలోనే సుమారు 500 కిలోల బంగారానికి సంబంధించి ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఆయా దుకాణాలతోపాటు యజమానులకు చెందిన ఆచారివీధి, కాపువీధి, పాత జెడ్పీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఉన్న వారి గృహాల్లో సైతం సోదాలు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి. స్థానిక పోలీస్, ఐటీ అధికారులకెవరికీ సమాచారం లేకుండానే కేంద్ర బలగాలతో నిర్వహించిన మెరుపు దాడులతో వ్యాపారులు ఉలిక్కి పడ్డారు. దీంతో నగరంలోని వందల సంఖ్యలో ఉన్న రిటైల్ బంగారు వ్యాపార సంస్థలు, పదుల సంఖ్యలో ఉన్న హోల్‌సేల్ వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
నెల్లూరులో ఏకకాలంలో..
ఓ గోల్డ్, డైమండ్స్ వ్యాపారి
ఇంట్లోనూ..
బిల్లులు, రికార్డుల పరిశీలన