
నిర్లక్ష్యం కొంప ముంచేనా?
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు పూర్తి చేయకుండా గాలికొదిలేసింది. సోమశిల జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తే నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు వణికిపోతాయి. ప్రధానంగా పెన్నానది పక్కనున్న 54వ డివిజన్‌లోని భగత్‌సింగ్ కాలనీని వరదనీరు ముంచెత్తేది. ఈ ప్రాంతంలోని వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయి పెద్దఎత్తున ఆస్తి నష్టం సంభవించేది. వరద నీటిలో పిల్లలు, సామగ్రితో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడే దృశ్యాలు కనిపించేవి. ఎంతోమంది నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. వరద తగ్గాక ఇంటికెళ్లి అష్టకష్టాలు పడి శుభ్రం చేసుకునేవారు. ఈ పరిస్థితులు తప్పించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నిధుల మంజూరు
గతంలో వరదలు రాగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భగత్‌సింగ్ కాలనీకి వచ్చారు. అప్పటి మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ సమస్యను ఆయనకు చెప్పారు. దీంతో పెన్నా నదికి వరదలు వచ్చిన సమయంలో కాలనీలోని నీరు ప్రవేశించకుండా రూ.100 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జగన్ నిధులు మంజూరు చేశారు. ఈ క్రమంలో పనులు ప్రారంభించారు. కొంతమేర వాల్ నిర్మాణం కూడా జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పనులు ఆగిపోయాయి. నాడు జరిగిన వాల్ నిర్మాణం వల్లే నేడు వరద నీరు విడుదలైనా ఇంకా కాలనీలోకి చేరలేదు. అధికారులు హడావుడిగా తాత్కాలికంగా మట్టి కట్ట పనులు చేపట్టారు. అధికారంలోకి వచ్చాక కూటమి సర్కారు స్పందించి మిగిలిన పని చేసి ఉంటే పూర్తి స్థాయిలో రక్షణ ఉండేది.
భగత్‌సింగ్ కాలనీ నేడిలా..
భగత్‌సింగ్‌కాలనీకి రక్షణగా
రిటైనింగ్ వాల్ నిర్మాణం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొంతమేర జరిగిన పనులు
కూటమి వచ్చాక ఆపేసిన వైనం
పూర్తి చేసి ఉంటే కాలనీ సేఫ్

నిర్లక్ష్యం కొంప ముంచేనా?

నిర్లక్ష్యం కొంప ముంచేనా?