
సోమశిలకు 23,234 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 23,234 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి క్రస్ట్‌గేట్ల ద్వారా పెన్నానదికి 14,850 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 400, కండలేరుకు 10,450 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 73.450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
బ్యారేజ్ నుంచి దిగువకు 27,800 క్యూసెక్కులు
సంగం: సోమశిల నుంచి సంగం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ నుంచి 27,800 క్యూసెక్కుల వరద నీటిని ఇరిగేషన్ అధికారులు 26 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దిగువన ఉన్న పెన్నా పరీవాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరూ పెన్నానదిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.