
భారీగా వరదొస్తే.. జల ప్రళయం తప్పదు
●
పెన్నా పొర్లుకట్టలు ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి వచ్చే వరద ఉధృతి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. వరదలు చెప్పి రావు. ముందు ముందు భారీ స్థాయిలో వరద వచ్చే అవకాశాలు లేవని చెప్పలేం. సోమశిల నిండుగా ఉంది కాబట్టి కచ్చితంగా ఈ దఫా భారీ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. గతంలో వచ్చినట్లు వస్తే జల ప్రళయం తప్పదు. 2021లో మా గ్రామ పొలాల్లో వరద వల్ల ఇసుక మేటలు వేశాయి.
– కే కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్,
మహ్మదాపురం