
ప్రశ్నించే కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం
అక్కసుతోనే ‘సాక్షి’పై అక్రమ కేసులు
●
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజల గొంతుకను వినిపించే పత్రికపై కక్ష పూరిత చర్యలు అప్రజాస్వామికం. పత్రికలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకేళ్లు వేయడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజాస్వామానికి ప్రమాదం వాటిల్లుతుంది. ‘సాక్షి’ ఎడిటర్‌తోపాటు ఆ పత్రిక జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను భేషరుతుగా ఉపసంహరించుకోవాలి. పత్రికల్లో వచ్చిన వార్తలపై అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్పా అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.
– ఖలీల్ అహ్మద్, వైఎస్సార్‌సీపీ స్టేట్ మైనార్టీ సెల్ సెక్రటరీ
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఫోర్త్ పిల్లర్‌గా పిలిచే మీడియా వ్యవస్థపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను, మోసాలను వెలుగులోకి తీసుకొస్తుందన్న అక్కసుతోనే ‘సాక్షి’ పత్రికను ఇబ్బంది పెట్టేందుకు ఆ పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితోపాటు విలేకరులపై అక్రమ కేసులు బనాయించారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని చెప్పాలి. పత్రికల గొంతు నొక్కి పత్రిక స్వేచ్ఛను అణచివేయాలని చూస్తే ప్రజా తిరుగుబాటు తప్పదు. అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలిచ్చిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేస్తోంది. ఈ సమయంలో ప్రజల గొంతుకై వ్యవహరిస్తున్న ‘సాక్షి’ గొంతు నొక్కాలని చూస్తోంది. ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలే కానీ పత్రిక యాజమాన్యాలను బెదిరించడం మంచి పరిణామం కాదు.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ

ప్రశ్నించే కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం

ప్రశ్నించే కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం