
వరద వణుకు
భయం గుప్పెట్లో పెన్నాతీర గ్రామాలు
పెన్నానదిలో గతేడాది నుంచి ఇసుక రీచ్‌లకు, తవ్వకాలకు అనుమతి లేదు. డ్రెడ్జింగ్ విధానంలో ఒకటీ.. రెండు చోట్ల అనుమతులు ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే ఊరూరా అనధికారికంగా రీచ్‌లు నిర్వహిస్తున్నారు. అక్టోబరు రెండో వారం వరకు నదిలో డ్రెడ్జింగ్ విధానానికి కూడా అనుమతుల్లేకపోయినా.. అయినా విచ్చలవిడిగా ఇప్పటికీ తవ్వుతున్నారు. ఫలితంగా విరువూరు ఓపెన్ రీచ్‌లో వరద నీటిలో రెండు ఇసుక ట్రాక్టర్లు చిక్కుకుని పోయాయి. వరద ఉధృతికి కొంత దూరం కొట్టుకుని వెళ్లడం గమనార్హం. సోమవారం సాయంత్రం సంగం బ్యారేజీ వద్ద సైరన్ మోగించి 23 వేల పైగా క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీకు సమీపంలో విరువూరు రీచ్ నుంచి ఇసుకను తరలించేందుకు వచ్చిన కావలికి చెందిన ట్రాక్టర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అయితే ఇసుకను ట్రాక్టర్లకు నింపేందుకు వచ్చిన కూలీలు వరద ఉధృతిని పసిగట్టి హుటాహుటిన గట్టుకు చేరుకోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు
ఎక్కడికక్కడ పొర్లు కట్టల ధ్వంసం
గతంలో కట్టలు బలంగా ఉన్నా.. గ్రామాల్లోకి నీరు
వరద ఉధృతి పెరిగితే ప్రమాదకరమని స్థానికుల ఆందోళన
పెన్నాకు వరదొస్తున్నా..
ఆగని ఇసుక దందా
విరువూరు, మినగల్లు రీచ్ గుంతల్లో కూరుకుపోయిన మూడు ఇసుక ట్రాక్టర్లు
కొట్టుకుపోయిన ట్రాక్టర్లు

వరద వణుకు