
కేసులు పెట్టడం దారుణం
హేయమైన చర్య
●
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన నిలబడుతున్న సాక్షికి చెందిన ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య. విలేకరులను అరెస్ట్ చేసి వారిని భయాందోళనకు గురి చేయాలనే విధంగా నేటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
– అరిగెల నాగేంద్రసాయి, సీపీఐ జిల్లా కార్యదర్శి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. ప్రజా సమస్యలపై వార్తలు రాస్తున్న సాక్షి ప్రతినిధులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. సాక్షిపై పెడుతున్న కేసులను ఆపివేయాల్సిన అవసరం ఉంది.
– కె.రాంబాబు, ఇండియన్ ఫెడరేషన్ ట్రేడ్
యూనియన్ (ఐఎఫ్‌టీయూ) జిల్లా కన్వీనర్

కేసులు పెట్టడం దారుణం

కేసులు పెట్టడం దారుణం