
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
నెల్లూరు(పొగతోట): పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సోమవారం మొదలైంది. వచ్చే నెల 15వ తేదీ వరకు ఇది జరుగుతుంది. మొత్తం 5.18 లక్షల డోసులు వేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాఽధి తీవ్రత అధికమైతే పశువులు మరణించే అవకాశం ఉంది. దీనిని మొదటి దశలోనే గుర్తించి పశువైద్యాధికారుల సలహాలు తీసుకుంటే రక్షించుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోండి
గాలికుంటు వ్యాధి నివారణకు ఉచితంగా వేస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ టి.సోమయ్య తెలిపారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌లోని పశువైద్యశాలలో సోమవారం పశువులకు టీకాలు వేశారు. ఆయన మాట్లాడుతూ పాడిరైతులు పశువైద్యశాలలో సంప్రదించాలన్నారు.
గ్రేడ్–2 మున్సిపాలిటీగా బుచ్చిరెడ్డిపాళెం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీని గ్రేడ్–2 మున్సిపాలిటీగా మార్పు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువగా నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.