
సమస్యలు పరిష్కరించాలంటూ..
● విద్యుత్ భవన్ వద్ద నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యలపై పలుమార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి వినతిపత్రాలిచ్చిన పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో 15, 16 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం, 17, 18 తేదీల్లో అన్ని సర్కిల్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ధర్నాలు, 19, 20 తేదీల్లో సర్కిల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు, 22వ తేదీన శాంతియుతంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్ అల్తాఫ్, శ్రీనివాసులు, దామోదర్, వెంకటేశ్వర్లు, విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, హజరత్‌వలీ, నాంచారయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.