
జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి
మందులు పూర్తిగా ఇవ్వడం లేదు
●
ఆరోగ్యం బాగా లేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ మేము చెప్పేది కూడా పూర్తిగా వినకుండానే మందులు రాసిస్తున్నారు. ఆ మందులు కూడా అన్ని దొరకడం లేదు. కొన్ని బయట కొనుక్కోమంంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– పద్మ, బుజబుజనెల్లూరు
మా ప్రాంతంలో ఎక్కువగా జ్వరాలున్నాయి. పెద్దాస్పత్రికి వెళ్తే మందులు రాసి పంపుతున్నారు. సైలెన్ కూడా పెట్టడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ ఫీజు, పరీక్షలంటూ కనీసం రూ.3 వేల.. రూ.4 వేలు ఖర్చు పెట్టిస్తున్నారు. దీంతో మాలాంటి పేదలకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది.
– రాజు, ఆటో కార్మికుడు, నెల్లూరు
జిల్లాలో జ్వరాలు నియంత్రణలోనే ఉన్నాయి. అక్కడక్కడ జ్వరాలు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య పెరగకుండా వైద్యశాఖ పక్షాన ప్రజలను చైతన్యం చేస్తున్నాం. దోమలు కుట్టకుండా , పుట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా డెంగీ, మలేరియా కేసులు నమోదైతే ఆ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య రక్షణ చర్యలు చేపట్టడమే కాకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. రోగులకు అవసరమైన మందులు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడైనా రోగులను సక్రమంగా పట్టించుకోలేదని ఫిర్యాదులు వస్తే అలాంటి చోట్ల విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం.
– సుజాత, డీఎంహెచ్‌ఓ
జ్వరాలు నియంత్రణలోనే ఉన్నాయి