
పత్రికపై కేసులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
●
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త సంస్కృతికి తెరతీసింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా, ప్రభుత్వాల దుర్నీతి పాలనను ఎత్తిచూపుతూ రాసే కథనాలపై పత్రిక ఎడిటర్, విలేకరులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేలా కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు పెట్టడం సరికాదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, వాస్తవాలను రాస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధతి కాదు. ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో పోలీసులు సైతం ఆత్మ విమర్శ చేసుకోవాలి.
– మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు