
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
వ్యవస్థలను నాశనం చేశారు
●
రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సీఎం చంద్రబాబు నాశనం చేశారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన పత్రిక స్వేచ్ఛపై కుట్రపూరిత కేసులు పెట్టడం హేయం. సమాజహితం కోరే పత్రిక రంగాన్ని ఆయనేమో వాడుకుంటున్నారు. వాస్తవాలు తెలిపే వారిపై కేసులు బనాయించడం, బెదిరించడం దుశ్చర్య. అక్రమాలను బయటపెట్టే వారిపై దాడి చేసేందుకు పోలీసులను సైతం వాడుకోవడం ఎంత వరకు సమంజసం. వాస్తవాలను తెలుసుకొని పరిపాలనను సరిదిద్దుకోవాల్సిన సీఎం.. ఇలాంటి పనులు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు. ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసు. ఇప్పుడున్న మీడియా, సోషల్ మీడియా దెబ్బకు ఆయనకు సరైన గుణపాఠం లభిస్తుంది.
– అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి
మీడియా స్వేచ్ఛపై సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దారుణాలు, అక్రమాలను బయటపెడతారనే భయంతో పాత్రికేయులను హింసించడం తగదు. సీఎం స్థానంలో ఉండి వార్తలు రాసే వారిని భయపెట్టడం, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్దం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని బెదిరించి అరెస్ట్ చేయడం దారుణం. ఖబడ్దార్ అంటూ పాత్రికేయులను బెదిరించడం సమంజసం కాదు. ఎడిటర్ స్థాయి వారి ఇంటికి పోలీసులను పంపడం.. మళ్లీ కేసులు పెట్టడం.. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చడం చంద్రబాబుకు తగదు. ఇలాంటి పాలనకు త్వరలోనే ప్రజలు సరైన సమాధానం చెప్తారు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు