
వెంకటరెడ్డిపాళెంలో చెరువు కట్ట ధ్వంసం
ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఇప్పటి వరకు గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్న కూటమి నేతలు తాజాగా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం పంచాయతీ వెంకటరెడ్డిపాళెంలో చెరువు కట్టను ధ్వంసం చేసి గ్రావెల్ తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి యంత్రాలు పెట్టి యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. చెరువు కట్ట ధ్వంసంపై స్థానిక రైతులు ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో రేయింబవళ్లు ట్రాక్టర్లతో గ్రావెల్ తరలింపు ఆగడంలేదు. రైతులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు రైతులను బెదిరిస్తున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని చెరువు కట్ట ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.