
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు అప్రజాస్వామికం
●
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం. ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసి ఉంటే వివరణ కోరవచ్చు. లేదా రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానంలో కేసు వేయొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న దుర్మార్గ పాలనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడాన్ని జీర్ణించుకోలేకనే ఏకంగా ఎడిటర్‌తోపాటు విలేకరులపై కేసులు నమోదు చేయడం ఏమిటి. ప్రజాస్వామ్యదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరిగినట్లు చరిత్రలో లేదు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విలేకరులపై పోలీసుల ద్వారా కేసులు పెట్టించడం విచారకరం. సోషల్ మీడియాను బెదిరించడం, అరెస్ట్‌లు చేయడంపై ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోతుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన రాష్ట్రంలో పాత్రికేయ రంగంపై బెదిరింపు కేసులు పెట్టడం సరైంది కాదు.
– ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు
వాస్తవాలు రాస్తే కేసులు పెడతారా?
ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో మీడియా ఒక స్తంభం. అలాంటి మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ వాస్తవాలను వెలుగులోకి తెస్తుంటే ప్రభు త్వం కేసులు నమోదు చేయడం దుర్మార్గంగా ఉంది. ‘సాక్షి’ పత్రిక ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతుందని ఎడిటర్‌పైనా, విలేకరులపైనా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యంలో ఇంత వరకు జరగలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతగా బరి తెగించలేదు. ప్రజలతీర్పుతో పార్టీల అధికారాలు మారుతూ ఉంటాయి. 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీపై కక్షతోనే ఈ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై పక్షపాత వైఖరి అవలంభిస్తోంది. కేసులు పెట్టి, పోలీసులతో దాడులు చేయించి భయపెట్టాలని చూడడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరికాదు. – మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు అప్రజాస్వామికం

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు అప్రజాస్వామికం