
పెన్నా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఏ సమయంలోనైనా దిగువకు
నీటి విడుదల
● 72 టీఎంసీలకు చేరువలో సోమశిల
సోమశిల: సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో దిగువ భాగంలో ఉండే పెన్నా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ జయవర్ధన్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయం 71.430 టీఎంసీలకు చేరుకుందని, రానున్న రెండు రోజుల్లో మరికొంత చేరే అవకాశం ఉన్న క్రమంలో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని ఎప్పుడైనా విడుదల చేయొచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400, కండలేరు కాలువకు 9250, పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1850 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని ఈఈ శ్రీనివాసులు తెలిపారు.